అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్‌ మోషన్‌

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పై ప్రివిలేజ్‌మోషన్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అచ్చెన్నాయుడు తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆయనపై ప్రివిలైజ్‌ మోష్‌ మూవ్‌ చేస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మోషన్‌ను ప్రివిలైజ్‌ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సిఫారసు చేశారు.

Continue Reading

ప్రతి నియోజకవర్గంలోనూ అగ్రిల్యాబ్స్‌

అమరావతి: శాసనమండలి లో ప్రశ్నోత్తరాల సందర్బంగా నకిలీ విత్తనాలు, ఎరువులు అనే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గుంటూరు కేంద్రంగా నకిలీ దందా నడుస్తోందని, దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ చేసిన దాడుల్లో రూ. 5.46 కోట్ల విలువైన కల్తీ యూరియాను సీజ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. 1455 నమూనాలను పరీక్షించగా 35 నమూనాలు నాసిరకంగా తేలాయని […]

Continue Reading

టీడీపీ వాళ్లు నోరు తెరిస్తే అబద్ధాలు: సీఎం జగన్‌

అమరావతి : గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్‌ అంతరాయాలు తగ్గాయని విద్యుత్‌ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యుత​ రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్‌ అంతరాయాలపై ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… టీడీపీ సర్కారు హయాంలో విద్యుత్‌ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా… 2018లో 53,016 ఫీడర్లు ఉండగా… 17320 గంటల పాటు […]

Continue Reading

అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన సభలో మాట్లాడుతూ..ఉపాధి హామీ పనుల్లో తాము అక్రమాలకు పాల్పడ్డామంటూ చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. తాము ముడుపులు తీసుకున్నానని చంద్రబాబు నిరుపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కాగా కేంద్రం నుంచి 1845 కోట్ల రుపాయల ఉపాధి నిధులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఉపాధి పనుల్లో భాగంగా వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని […]

Continue Reading

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన బుద్ధా వెంకన్న

చిట్టి నాయుడు అంటూ నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. చిట్టి రెడ్డి అంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు సంధించారు. “చిట్టి రెడ్డి తండ్రి గెలిచిన చోట కాలర్ ఎగరేస్తాడు. కన్నతల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు. అయినప్పటికీ తనదే పైచేయి అంటాడు. దొంగ పనుల కారణంగా చిప్పకూడు తిన్నా బడాయి మాటలు మాట్లాడుతుంటాడీ చిట్టి రెడ్డి… చరిత్ర మర్చిపోయారా విజయసాయిరెడ్డిగారూ!” అంటూ […]

Continue Reading

జనసేనకే కాదు.. వైసీపీకి ఆయన తలనొప్పే..!

తన మాటలు, చేతలతో సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు అధికార పార్టీలోను చిచ్చు రేపుతున్నాడు. జనసేన తరపున గెలిచి ముఖ్యమంత్రి జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సొంత పార్టీకే కాకుండా అధికార వైసీపీకి తలనొప్పిగా మారారు. రాపాక వరప్రసాద్.. జనసేన తరపున పోటీ చేసిన పవన్ కల్యాణ్ సహా అందరూ ఓడిపోగా.. వైసీపీ ఊపులోను రాజోలులో తాను మాత్రం గెలిచి తానేంటో చూపించారు. అయితే, గెలిచినప్పట్నించి అధికార వైసీపీతో […]

Continue Reading