వసుధ ఫౌండేషన్ – దాన ఉత్సవం” అధ్యక్షులు మంతెన వెంకట రామరాజు ఆధ్వర్యంలో..

27 – 12 – 2019, హైదరాబాద్ న్యూస్. “ వసుధ ఫౌండేషన్ – దాన ఉత్సవం” అధ్యక్షులు మంతెన వెంకట రామరాజు ఆధ్వర్యంలో హోటల్ కత్రియ ఫంక్షన్ హాల్ నందు ఫౌండేషన్ ఉత్సవం జరిగింది ముఖ్య అతిథులుగా గౌ: శ్రీ. గరికిపాటి నరసింహారావు, శ్రీ.మంతెన రామలింగ రాజు, డాక్టర్. కరుణాకర్ త్రిదేవ్, ఎస్ మెహతా విచ్చేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి,పలురాష్ట్రాల నుండి విచ్చేసిన సేవా సంఘాల కు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు […]

Continue Reading

అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్‌ మోషన్‌

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పై ప్రివిలేజ్‌మోషన్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అచ్చెన్నాయుడు తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆయనపై ప్రివిలైజ్‌ మోష్‌ మూవ్‌ చేస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మోషన్‌ను ప్రివిలైజ్‌ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సిఫారసు చేశారు.

Continue Reading

ప్రతి నియోజకవర్గంలోనూ అగ్రిల్యాబ్స్‌

అమరావతి: శాసనమండలి లో ప్రశ్నోత్తరాల సందర్బంగా నకిలీ విత్తనాలు, ఎరువులు అనే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గుంటూరు కేంద్రంగా నకిలీ దందా నడుస్తోందని, దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ చేసిన దాడుల్లో రూ. 5.46 కోట్ల విలువైన కల్తీ యూరియాను సీజ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. 1455 నమూనాలను పరీక్షించగా 35 నమూనాలు నాసిరకంగా తేలాయని […]

Continue Reading

కలెక్టర్లకు, ఎస్పీలకు జగన్ ఝలక్.. కారణం అదే !

ఏపీలోని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు చెబుతూ వచ్చిన మాటని పక్కన పెట్టారు. ఉన్నట్లుండి జగన్ తీసుకున్న నిర్ణయంతో కలెక్టర్లు, ఎస్పీలు షాక్‌కు గురయ్యారు. ముందు అలా చెప్పి, ఇప్పుడిలా చేయడమేంటని నివ్వెరపోతున్నారు కలెక్టర్లు, ఎస్పీలు. గత 8 రోజులుగా ముఖ్యమంత్రి జగన్ సహా ప్రభుత్వ పెద్దలంతా అసెంబ్లీ శీతాకాల సమావేశాలతో బిజీగా వుండిపోయారు. గత ఆరునెలల పాలనపై సభలోను వాడీవేడీ చర్చ జరిగింది. […]

Continue Reading

విద్యార్ధులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ..

ప్రభుత్వ జూనియర్ కళాశాల వృత్తి విద్యా కోర్స్ ఓ ఎ ఎస్ గ్రూప్ విద్యార్ధులకు వృత్తి నైపుణ్యంలో ఇచ్చారు.. స్థానిక గ్రంథాలయంలో వారికి 30 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.. ఈ శిక్షణ వల్ల వృత్తి నైపుణ్యం పెరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ కె. యోహాన్ ,అధ్యాపకులు జి.నరసింహారావు, బి.భాస్కరరావులు పేర్కొన్నారు.. ఈ శిక్షణ కార్యక్రమంలో లాబ్ అసిస్టెంట్ ఎం రాము,లక్ష్మణరావు లు సహకరించారు.

Continue Reading

టిడిపి అవినీతిపై రాపాక ఫైర్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా సమావేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ టిడిపి పైన మండి పడ్డారు. సభలో ప్రశ్నోతారాలు కొనసాగుతున్న సమయంలో తన నియోజవర్గం అయిన రాజోలులో రహదారుల గురించి రాపాక ప్రస్తావించారు. ఆ సమయంలో టిడిపి హాయంలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. గతంలో రాజోలు నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన టిడిపి ఎమ్మెల్యే సూర్యారావు ఎటువంటి డెవలప్‌ మెంట్‌ చేయలేదన్నారు. సూర్యారావు మాత్రం […]

Continue Reading

‘ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు’

అమరావతి: రాజకీయమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం తగదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. సోమశిల-మర్రిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోలేదన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో 5 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. భూసేకరణ సమస్యను కూడా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 90 వేల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. పంపింగ్‌ పనుల్లో నాసిరకమైన పనులు కొన్ని […]

Continue Reading

అక్కడ ఉర్దూ రెండో భాషగా ఉంది: అవంతి

అమరావతి: తెలుగు, ఉర్దూ భాషల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా రెండవ అధికార భాషగా ఉర్దూ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ… టీడీపీ హయాంలో అధికార భాష సంఘాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. దీనికి సాహిత్యవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను చైర్మన్‌గా, పలువురు భాషావేత్తలను సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు. […]

Continue Reading

ఉల్లికోసం లొల్లి. పలువురికి గాయాలు

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్ల వద్ద ప్రజలు ఉల్లిపాయల కోసం గంటలతరబడి క్యూలో నిల్చుంటున్నారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో రైతు బజార్ వద్ద ఉల్లిపాయల కోసం తోపులాట జరిగింది. గేట్లు తీయగానే ఒక్కసారిగా ప్రజలు రైతు బజార్‌లోకి పరుగులు తీశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

Continue Reading

టీడీపీ వాళ్లు నోరు తెరిస్తే అబద్ధాలు: సీఎం జగన్‌

అమరావతి : గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్‌ అంతరాయాలు తగ్గాయని విద్యుత్‌ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యుత​ రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్‌ అంతరాయాలపై ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… టీడీపీ సర్కారు హయాంలో విద్యుత్‌ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా… 2018లో 53,016 ఫీడర్లు ఉండగా… 17320 గంటల పాటు […]

Continue Reading