స్పీడ్ పెంచిన రాజ్ తరుణ్

Movies

రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న రాజ్ తరుణ్ సినిమా విశేషాలతో పాటు తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. రీసెంట్ గా ‘ఒరేయ్ బుజ్జిగా’ షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో పాటే రానా నిర్మాణంలో ‘డ్రీం గర్ల్’ రీమేక్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక సినిమా కమిట్ అయ్యాడు. వీటి తర్వాత మెగా ఫోన్ పట్టి సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *