మందు లేదు,నివారణే మార్గం.

News

19-02-2020. విశాఖ జిల్లా చోడవరం న్యూస్.
“మందు లేదు,నివారణే మార్గం”
ప్రపంచ దేశాలను కొద్దిరోజులుగా వణికిస్తున్న, భయభ్రాంతులకు గురిచేస్తున్నా కరోనా వైరస్. చైనా దేశంలో రోజురోజుకీ మరణాల రేట్లు పెంచుతున్న వైరస్, భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు, స్థానిక సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైరస్ పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్ష- కార్యదర్శులు. శ్రీ జంగం జోషి, ఐ.గోపాలరావు ప్రారంభించగా స్థానిక అధ్యక్ష కార్యదర్శులు, నిమిషకవి రాజు, ఏ.వి.శ్రీకాంత్ ర్యాలీని నడిపించారు. కరోణ వైరస్ అనేది కొన్ని వైరస్ ల సముహమని, దీనికి మందు లేదని, నివారణ మార్గమని తెలిపారు. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫెక్ష న్స్,వైరస్ లు రాకుండా జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, నినాదాలు చేస్తూ, ప్రేమ సమాజం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వరకు రోడ్డుపై ర్యాలీని నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ఆర్. ఎం.పి. వైద్యులందరికీ, డాక్టర్ ఎల్.హరిబాబు. వైద్య గాహన సదస్సు నిర్వహించి, వారికి వైరస్ లో వచ్చే జాగ్రత్తలను తెలిపారు. డాక్టర్ ఎల్ హరిబాబు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం అని ప్రతి ఒక్కరూ దగ్గు తుమ్ములు ఊపిరితిత్తులు సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, తగు పరీక్షలు నిర్వహించుకుని మందులు వాడుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు మరియు అర్. ఎం. పి. వైద్యు సబ్యులు, నాయకులు ఏ. రాజు, రమణ రావు, లీడర్ ఎన్జీవో కన్వీనర్ రమేష్,ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *