గుంటూరు రాజధాని లో.ఆర్.ఎం.పీ. గ్రామీణ వైద్యుల రాష్ట్రస్థాయి సమావేశం…

News

గుంటూరు రాజధాని లో.ఆర్.ఎం.పీ. గ్రామీణ వైద్యుల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది.
తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమకార్యక్రమాలు నిర్వహిస్తున్న, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ వైద్యుల సమస్యలను విస్మరిస్తున్నారని, రాష్ట్ర అధ్యక్షులు టీ. రాజా సిద్ధార్థ అన్నారు. ఈ కార్యక్రమానికి MLC రాయపాటి శ్రీనివసరావు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు ప్రభుత్వము గుర్తించాలని కోరారు వారి కోరిక ఇరోజుది కాదని కొన్ని దశాబ్దాల కాలం నాటి నుండి దని,న్యాయమైన కోరికని వారు తెలిపారు.రాష్ట్రంలో 46 వేల కుటుంబాలు ప్రాథమిక వైద్యం చేస్తూ, వారు జీవనోపాధి పొందుతున్నారని, దశాబ్దాల కాలం నుండి ప్రాథమిక వైద్యాన్ని నిర్వహిస్తున్న మా బోటి వైద్యులకు చట్ట భద్రత కల్పించాలని, రాష్ట్ర కార్యదర్శులు – జంగం జోషి, కంబాల బాబురావు. ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకున్నారు. రాష్ట్ర ఫెడరేషన్, (అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య) ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు 13 జిల్లాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశానుసారం గా త్వరలో నిర్మించబడుతున్న, వైయస్సార్ విలేజ్ క్లినిక్లుకు బిఎస్సి నర్సింగ్, ఏఎన్ఎం తో పాటు ఒక ఆర్ఎంపి వైద్యుడును నియమిస్తే బాగుంటుందని వారు సూచన ప్రాయంగా పాలిట్ బ్యూరో సభ్యుడు రుద్రయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు అచ్చిరెడ్డి, అల్లడ. త్రినాధ రావు, యు. ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *