డిల్లీలో,కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యుల కు ఎన్.ఎం.సి.బిల్, పై వినతిపత్రం ఇచ్చిన జంగం జోషి,గోపాల్ రావు.

News

12-3-2020.
పత్రికా ప్రకటన
న్యూఢిల్లీ,థిస్ జాన్వరి మార్గం.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ శ్రీ డాక్టర్ హర్షవర్ధన్ గారిని కలిసిన అనుభవ వైద్యుల సంఘాల సమైక్య (రాష్ట్ర ఫెడరేషన్) అదనపు కార్యదర్శి జంగం జోషి మరియు ఉత్తరాంధ్ర జోనల్ కార్యదర్శి ఐ. గోపాలరావు.
భారతదేశంలో సుమారు 11 లక్షల మంది ఉన్నారని వారు అనుభవం కలిగిన వైద్యంతో ప్రాథమిక చికిత్స చేస్తున్నారని అలాగని ఆంధ్ర రాష్ట్రంలో46 వేల మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు డాక్టర్ హర్షవర్ధన్ కు నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2008లో 429 జీవో ఇచ్చి ఈ ప్రాథమిక వైద్యం చేస్తున్న అనుభవం కలిగిన వైద్యులకు ప్రభుత్వం చట్టబద్ధతను కలుగ చేసే విధంగా 429 జీవో ఇచ్చినట్లు తెలిపారు అయితే అనివార్య కారణాల వల్ల ప్రభుత్వాలు జీవోను అమలు చేయలేక పోయామని ఆ జీవోను తమరు చొరవ తీసుకుని అది అమలయ్యే విధంగా చూడాలని మంత్రిని కోరారు. అలాగనే భారతదేశంలో మాలాంటి వైద్యం చేసే వారు 11 లక్షల మంది ప్రాథమిక వైద్యం చేస్తూ కుటుంబాలతో బ్రతుకుతున్నారు అని తెలుపుతూ.. మీరు ప్రవేశపెట్టిన ఎన్.ఎం.సి, (నేషనల్ మెడికల్ కమిషన్) 32 వ పేజీలో పొందుపరిచిన విధముగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యవిధానంలో హెల్త్ ప్రొవైడర్స్ ఏర్పాటు చేయాలని వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు మీరు తెలిపిన విధముగా, అలాంటి శిక్షణలో 11 లక్షల, ఈ ప్రాథమిక వైద్యులను అర్హులైన వారికి అవకాశమిచ్చి ఈ విలేజ్ క్లినిక్ లో మాబోటి వారు కూడా సేవలు అందించే విధంగా మాకు ఒక అవకాశం కలిగించమని మంత్రి గారిని కోరారు. మంత్రిగారు సానుకూలంగా స్పందిస్తూ, ఎన్. ఎం.సి.కమిషనర్ కి సిఫారసు చేస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి జంగం జోషి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జోనల్ కార్యదర్శి గోపాలరావు, డిల్లీ స్థానిక మహిళ ఆర్ఎంపి వైద్యులు శ్రీ ధన్య మరియు స్థానిక వైద్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *