ఫెడరేషన్ నాయకులు జోషి, గోపి కి ఘనస్వాగతం

News

ఫెడరేషన్ నాయకులు జోషి, గోపి కి ఘనస్వాగతం
15-03-2020.

దేశంలో ఉన్న 11 లక్షలు, రాష్ట్రంలో సుమారు 46 వేల మంది ఆర్ఎంపీ/పియంపి వైద్యుల సమస్యలపై, కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ హర్షవర్ధన్ గారికి వ్రాతపూర్వకంగా ఒక మెమోరాండం ఇచ్చిన మా
అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య,(ఫెడరేషన్).రాష్ట్ర అదనపు కార్యదర్శి.జంగం జోషి మరియు ఐ.గోపాలరావు కు ఈరోజు ఢిల్లీ నుండి విశాఖ తిరిగివచ్చిన సందర్భంగా,జిల్లా ఉత్తరాంధ్ర నాయకులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి. చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 46 వేల మంది ఆర్ఎంపి వైద్యల చట్ట భద్రత కై కృషి చేస్తూ, మరోపక్క దేశంలోనే సుమారు 11 లక్షల గ్రామీణ వైద్యుల సమస్యలపై, ఆరోగ్యశాఖ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ హర్షవర్ధన్ గారి దృష్టికి తీసు కువెళ్లరు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన ఆర్ఎంపీ వైద్యులకు విలేజ్ క్లినిక్ లలో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరగా, ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన,ఎన్.ఎం.సి.బిల్ (నేషనల్ మెడికల్ కమిషన్) 32, వ పేజీ నీ అనుసంధానంగా విలేజ్ మరియు స్లమ్ ఏరియాలో హెల్త్ ప్రొవైడర్స్ అవసరమని, వారికి ప్రధమ చికిత్స అనుభవం కలిగినట్లు ఒక శిక్షణ ఇచ్చి వారిని హెల్త్ ప్రొవైడర్స గా ప్రమోట్ చేయాలని ప్రకటించడంలో అందరికీ తెలిసినదే.ఆ ప్రకటన మూలంగా 11 లక్షలు ఆర్ఎంపి వైద్యులు దేశంలో ఉన్నారు. కనుక వారికి కూడా అందులో అవకాశం కల్పించాలని, నేడు ప్రధాన ఉద్దేశంగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి.జంగం జోషి, ఉత్తరాంధ్ర జోనల్ కార్యదర్శి i. గోపాలరావు డిల్లీ వెళ్లినట్లు నాయకులు తెలిపారు. ఈ స్వాగతాంజలి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కనకారావు, స్థానిక నాయకులు బాల శంకరం,ఎల్. గణేష్ ,కె .ఎన్. రావు, పి. సుధాకర్ రెడ్డి,ఆకుల శ్రీనివాసరావు, మహిళా సభ్యురాలు శ్రీమతి కళ, తదితరులు పాల్గొన్నారు.
కృతజ్ఞతలు:
గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కారం కై కేంద్ర మంత్రివర్యులను కలవటానికి సహకరించిన, ప్రియతమ నాయకులు, విశాఖ ఎంపీ. గౌ: శ్రీ. ఎం.వి.వి.సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు జంగం జోషి గోపాల రావు స్థానిక నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *