షాపులు తెరవబడ్డాయి.జనం ఊపిరి పీల్చుకుంటున్నారు…

News

కావ్య న్యూస్ విశాఖపట్నం.28-3-2020.
“షాపులు తెరవబడ్డాయి.జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.”
గత వారం రోజులుగా లాక్ డౌన్, ఇంటికే పరిమితమైన ప్రజానీకం ఇరోజు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చారు.అతి పెద్ద షాపింగ్ మాల్ అయినా,ది మార్ట్, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయటానికి ప్రజలకు అనుమతి ఇచ్చింది. మధురవాడ లో ఉన్న డి మార్ట్ ప్రారంభించడం అయినది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఉదయం 7 గం:ల నుంచి 1:గంట వరకు సరుకులు కొనుగోలు చేసే విధంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సామాజిక భద్రత దృష్టిలో ఉంచుకుని, ఒక పద్ధతిలో సరుకులు ఇస్తున్నట్లు ఈ దృశ్యంలో గమనించవచ్చు. ఇంకా ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగుతున్నట్లు దేశ ప్రధాని ప్రకటించడం అందరికీ తెలిసినదే.అయితే అక్కడ అక్కడ జనం గుమ్ముగుడి వ్యాపార విక్రయాలు జరుగుతున్నాయి. ఇది ప్రమాదమని , ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, ఒకటి లేదా రెండు మీటర్ల దూరాన్ని పాటించాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *