కావ్య న్యూస్. విశాఖపట్నం 30-3-20 20.
“మూసివేసిన ప్రధమ చికిత్స కేంద్రాలు”
నేడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కువైట్ 19.( కరోనా వైరస్) ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపుమేరకు లాక్ డౌన్ ప్రకటించడం అందరికీ తెలిసినదే. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. విశాఖ జిల్లా సామాజిక గ్రామీణ వైద్యులు ఏప్రిల్ 14 వ తారీకు వరకు ప్రధమ చికిత్స కేంద్రాలు మూసివేసే ఉంచాలని, సామాజిక వైద్యుల సంఘం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి, మొబైల్ ద్వారా వారికి ప్రధమ చికిత్స సూచనలు ఇవ్వాలని, ఎవరైనా క రోణ వైరస్ సంబంధిత లేదా సూచనలు అనగా దగ్గు, జలుబు, జ్వరం మొదలగునవి తెలియజేస్తే, ఆరోగ్యం కేంద్రాల్లో సిబ్బందికి లేదా వాలంటరీ లకు తెలియజేయలని జిల్లా గ్రామీణ వైద్యులకు రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల సమైక్య అదనపు కార్యదర్శి జంగం జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం తీసుకున్న నిర్ణయాలను పాటించాలని కోరుతూ,నిబంధనలు ఉల్లంఘిస్తే సంఘ పరమైన మరియు చట్టపరమైన చర్యలు ఉంటాయని జోనల్ కార్యదర్శి ఐ.గోపాలరావు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వైరస్ తగ్గు మొహం పెట్టినట్లయితే ప్రభుత్వ సూచనల మేరకు ప్రథమ చికిత్స కేంద్రాలు ఎప్పుడు ప్రారంభించాలి,అనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని జోషి తెలిపారు.ప్రాథమిక వైద్యులు సహకరించాలని, ప్రజాసంక్షేమానికి అందరు కలిసి నడుం బిగించాలని వారికి విజ్ఞప్తి చేశారు.
