16-06-2020. కావ్య న్యూస్ *విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఎంపి నాయకులు జంగం జోషి.**
విశాఖ పట్టణ ప్రాంతాల్లో ఫీవర్ క్లినిక్లు ఏర్పాటు చేసేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే డాక్టర్లు కొరత ఉన్న ప్రదేశాలలో ఆర్ఎంపీ వైద్య సేవలు వినియోగించుకునే విధముగా పత్రిక ప్రకటనలో తెలియజేశారు. సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం గతంలో కలెక్టర్ గారికి ఇచ్చిన వినతి పత్రం, వారు గుర్తు చేసుకున్నందుకు, కలెక్టర్ గారికి ఆర్ఎంపి నాయకుడు జంగం జోషి హర్షం వ్యక్తం చేశారు.
ఆర్.ఎం.పి గ్రామీణ వైద్యులు సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకుని మంచి సేవలు ప్రజలకు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగావైద్యులకు విజ్ఞప్తి చేశారు