“స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు”…

News

సీతమ్మధార, ప్రియదర్శిని కాలనీ.
“స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు”
ప్రపంచ మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ మాసం సందర్భంగా. కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్, మైత్రి ఎన్జీవో సంఘం. సంయుక్త ఆధ్వర్యంలో, స్థానిక జీ.వీ.ఎంసీ. సామాజిక భవనం లో మహిళా ఆరోగ్య అవగాహన సదస్సు మరియు ఆరోగ్య పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లైన్స్ క్యాన్సర్ హాస్పటల్ డైరెక్టర్. సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీధర్ పుట్రెవ్, స్త్రీల వైద్యనిపుణులు డాక్టర్ రుక్మిణి రోగులకు వైద్య సేవలు అందించారు. సుమారు 80 మందికి రక్త పరీక్షలు,10 బయాప్సీ స్మీర్ పరీక్షలు నిర్వహించారు. విచ్చేసిన రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ అతి త్వరగా తెలుసుకోవచ్చని,క్యాన్సర్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే కచ్చితంగా నయం అవుతుందని తెలుపుతూ,, స్త్రీలలో ఎక్కువ మంది ఎనీమియా(రక్తలేమి) కేలిష్యం లోపాలతో ఉంటారని, మంచి పోషకాహారము, సమతుల్య ఆహారం తీసుకోవాలని కోరారు. జాగ్రత్తలు తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని, ముఖ్యంగా కరోణ,క్యాన్సర్ వంటి రోగాలను అధిగమించే శక్తి వారి కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కనుక ప్రపంచం ఆరోగ్య స్త్రీల ఆరోగ్య మాసంగా అక్టోబర్ నెల పరిగణించడం జరిగింది. కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్. జంగం జోషి. మైత్రి ఎన్జీవో సంఘం అధ్యక్షురాలు కాకి అరుణ, మాట్లాడుతూ, క్యాన్సర్ మహమ్మారినీ తరిమి కొట్టడం కోసం ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమం చేపట్టామని, ఈ నెలలో నాలుగు సార్లు పలు గ్రామీణ ప్రాంతాలలో కేన్సర్ పై ప్రజా అవగాహన సదస్సులు నిర్వహించమని తెలిపారు. లైన్ హాస్పిటల్ పారామెడికల్ స్టాఫ్, మైత్రి ఎన్జీవో సభ్యులు శ్రీనివాస రావు, రాము, యామిని, సంతోష్ కుమార్, గ్రామీణ వైద్యుల సంఘం కోశాధికారి నరేంద్ర కుమార్ ఈ వైద్య శిబిరంలో రోగులకు సేవలందించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *