విజయనగరం జిల్లా మెంటాడ మండలం లింగాలవలస.
*సేవా సంఘాల ద్వారా ప్రజలకు మేలు*
ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా. మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులకు ఆండ్ర ఎస్సై షేక్ శంకర్, సంఘం అధ్యక్షులు ఇప్పలవలస గోపాలరావు, బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంఘం మమ్ముల తిరుపతిరావు ల చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ చేశారు. సేవా సంఘాల ద్వారానే పేద ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఎస్.ఐ. షేక్ శంకర్ అన్నారు. సంఘ ప్రతినిధులను అభినందించారు. మానవ హక్కుల సంస్థ చైర్మన్ సంతోష్, విద్యా కమిటీ చైర్మన్ సింహాచలం,మాతృభూమి సేవా సంఘం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
