డిశంబరు 25వ తేదీన డి-ఫారంఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉండాలి

News

• డిశంబరు 25వ తేదీన డి-ఫారంఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉండాలి

• డిశంబరు 1వ తేదీ నాటికి లే ఔట్ ల పనులన్నీ పూర్తి కావాలి

• తహసిల్థార్ కార్యాలయాల్లో పట్టాల పంపిణీ రిజిష్టర్లు ఉండాలి

• మండలాల వారీగ తహసిల్థార్లతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

విశాఖపట్నం,నవంబరు,20: డిశంబరు 25వ తేదీన డి-ఫారం ఇళ్ళ పట్టాల పంపిణీకి సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తహసిల్థార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డి-ఫారం ఇళ్ళ స్థల పట్టాలు పంపిణీకి సంబంధించి సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు, తహసిల్థార్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిశంబరు 1వ తేదీ నాటికి లే ఔట్ల పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. పట్టాలు పంపిణీకి సంబంధించిన రిజిస్టర్లు తహసిల్థార్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో ఉండాలన్నారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూమిని చూసి త్వరిత గతిన లే ఔట్ ల తయారీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూ సేకరణకు సంబంధించిన బిల్లులు ఉంటే వాటిని అప్ లోడ్ చేయాలని తెలిపారు. లేఔట్ లలో అంతర్గత రహదారులు, మార్కింగ్ లలో రాళ్ళు పై నంబర్లు వేసి అన్నింటిని పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉండాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న లే ఔట్ లపై దృష్టిసారించాలని తెలిపారు. లే ఔట్ లో లబ్దిదారునికి కేటాయించిన స్థలం స్పష్టంగా ఉండాలని చెప్పారు. రికార్డులు తయారు చేసి ఉంచుకోవాలని చెప్పారు. అన్ని లే ఔట్లు ఒకే విధంగా ఉండాలని తెలిపారు. ప్రతి మండలంలోని తహసిల్థార్ కార్యాలయంలో పట్టాలకు సంబంధించిన రిజిస్టర్ ను ఏర్పాటు చేసింది లేనిది సంబంధిత ఆర్.డి.ఓ.లు తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. మండలాల వారీగ గ్రామాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాలను కలెక్టరేట్ కు పంపాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో అప్ డేట్ గా ఉన్న లబ్దిదారుల జాబితాలను ఉంచాలని చెప్పారు. కొత్తగా వచ్చిన ధరఖాస్తులను 90 రోజుల్లో పరిశీలించాలని, ఈ దరఖాస్తులలో అర్హత గల వారిని లబ్దిదారుల జాబితాలో చేర్చాలన్నారు. డిశంబరు 25వ తేదీన పంపిణీ చేయనున్న డి-ఫారం పట్టాలను సంబంధిత ప్రజా ప్రతినిధులతో పంపిణీ చేయించాలని పేర్కొన్నారు. డిశంబరు 25వ తేదీ నాటికి ఏ విధమైన పనులు పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. లే ఔట్లకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పూర్తి అయిన లే ఔట్లను సంబంధిత తహసల్థార్లు ప్రతీ రోజు వెళ్ళి లబ్దిదారులతో మాట్లాడి పరిశీలించాలని తెలిపారు. ఎ.పి.టిడ్ కో, జివియంసి, గ్రామీణ ప్రాంతాలలోని పంపిణీ చేయనున్న పట్టాలపై చర్చించారు. మండలాల వారీగ సమీక్షించి ఏ ఏ మండలాల్లో సమస్యలు ఉన్నదీ తహసిల్థార్లను అడిగి తెలుసుకొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూమిని త్వరితగతిన చూసి లే ఔట్ లను లెవెల్ చేయాలన్నారు. సర్వే రాళ్ళపై నంబర్లు వేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో జివిఎంసి కమీషనర్ జి. సృజన, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ ఎ. ప్రసాద్, విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు ఆర్.డి.ఓ.లు పెంచల కిశోర్, సీతారామారావు, శివజ్యోతి, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, పిడి డ్వామా సందీప్, కలెక్టరేట్ ఎ.ఓ.రామమోహన్, టిడ్ కో అధికారులు, తహసిల్థారులు, తదితరులు పాల్గొన్నారు.

జారీః ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *