క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసినపుడే తగిన గుర్తింపు

News

క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసినపుడే తగిన గుర్తింపు వస్తుందని డిజిపి విజయకుమార్ అన్నారు. అంకిత భావంతో సిబ్బంది కృషి చేయాలని ఏపీఎస్పీ రేంజ్‌ ఫోర్‌ డీఐజీ జి.విజయకుమార్‌ పిలుపునిచ్చారు. బక్కన్నపాలెం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ను రెండో రోజు ఆదివారం కూడా ఆయన పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ విధంగా విధులు చేపట్టాలి, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ డి.ఉదయభాస్కర్‌ తదితరులు డీఐజీ విజయకుమార్‌కు జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *