పత్రికా ప్రకటన .. నర్సీపట్నం … జనవరి 4
నర్సీపట్నం నియోజక వర్గం…..
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకంలో భాగంగా సోమవారం నర్సీపట్నం నియోజక వర్గం గొలుగొండ మండలం జోగింపేట, సాలిక మల్లవరం, పాత మల్లంపే ట,పప్పుసెట్టి పాలెం, చీడిగుమ్మల,గ్రామ పంచాయతీ లకు చెందిన సొంత ఇళ్లు లేని అర్హులైన పేద లబ్ది దారులకు ఇళ్ళ స్థల పట్టాలను శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో గొలుగొండ తహసీల్దార్ కే వెంకటేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
నర్సీపట్నం అర్బన్ పరిధిలో టిడ్కో గృహాల కు సంబందించి సుమారు 300 మంది అర్హులైన లబ్దిదారులకు శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఇంటి పట్టాలను అందజేసారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ పి కనకారావు, తహసీల్దార్ జయ,ఇతర రెవిన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
………
పాయకరావుపేట నియోజక వర్గం…..
పాయకరావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు గొల్ల బాబూరావు పాయకరావుపేట మండలం పాల్మన్ పేట, ఎడతాం గ్రామ పంచాయితీ లకు చెందిన లబ్ది దారులకు ఇంటి స్థల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పి అంబేద్కర్,ఇతర రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు.
నక్కపల్లి మండలం గుల్లిపాడు, దోసల పాడు, రెబాక, రమణయ్య పేట, ఎం ఆర్ పేట, ఉద్దండ పురం గ్రామ పంచాయతీల లబ్దిదారులకు ఇళ్ల స్థల పట్టాలను అందజేశారు.
ఈ కార్య క్రమంలో మండల తహసీల్దార్ వి వి రమణ,ఇతర రెవెన్యూ అధికారులు హాజరయ్యారు.
………………………………………………….
జారీ.. డివిజనల్ పౌరసంబంధాల అధికారి, నర్సీపట్నం..