భారీ క్యాన్సర్ ర్యాలీని నిర్వహించన గ్రామీణ వైద్యులు*

News

 

*భారీ క్యాన్సర్ ర్యాలీని నిర్వహించన గ్రామీణ వైద్యులు*

04-02-2021,

ఆర్కె బీచ్ విశాఖపట్నం.

విశాఖ బీచ్ నందు కాళికామాత గుడి నుండి భారీ ర్యాలీ నిర్వహించిన సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం. క్యాన్సర్ పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు గ్రామీణ వైద్యుల జోనల్ అధ్యక్షులు జంగం జోషి తెలిపారు. ఈ ర్యాలీకి అతిథులుగా సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీధర్ పుట్రేవ్, త్రీ టౌన్ పోలీస్ సిబ్బంది ఎస్ ఐ.శంకర్ రావ్, ఏ.ఎస్.ఐ. దుర్గారావులు పాల్గొన్నారు. డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ,, క్యాన్సర్ వ్యాధి మానవ శరీరంలో అన్ని భాగాలకు సోకు తుందని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించగలిగితే ఎటువంటి ప్రమాదం జరగదని తెలిపారు. చుట్టా,సిగరెట్, పాన్ పరాక్, జర్దా,ఇలాంటి పొగాకు సంబంధిత పదార్థాలకు, వ్యసనాలకు ప్రజలను దూరంగా ఉండాలని వారు కోరారు. ఎస్.ఐ. శంకర్రావు, ఏఎస్ఐ దుర్గారావులు మాట్లాడుతూ, ఈ మహమ్మారి వ్యాది బారిని పడకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ముఖ్యంగా యువకులు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని వారు కోరారు. గ్రామీణ వైద్యుల సంఘం మరియు కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగినది ఈ ర్యాలీకి సిటి ఇంచార్జ్ ఆకుల శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుగునేశ్వరి, సిటి అధ్యక్ష కార్యదర్శులు బాల శంకర్,ఎల్. గణేష్, కోశాధికారి జి నరేంద్ర కుమార్, పి.ఎస్.పత్తి,వెంకట్ రావు, కే ఎం రావు, మహిళా సభ్యులు సూర్య కళ, వాణి, పుష్పలత. వెంకట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *