గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ ర్యాలీ

News

*గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ ర్యాలీ*

జి.సిగడాం మండలం శ్రీకాకుళం జిల్లా.

స్థానిక మండలంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా. ఆర్ఎంపీ- సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ పై ప్రజా అవగాహన ర్యాలీ జరిపారు. ఆర్ఎంపీ వైద్యుల మండల అధ్యక్షులు సిహెచ్ ఉమామహేశ్వరరావు అధ్యక్షతనలో స్థానిక కే.జీ.బీ.వీ. స్కూల్ బాలికలతో ఈ ర్యాలీని నిర్వహించారు. స్కూల్ స్పెషల్ ఆఫీసర్ B. ఉష రత్నకుమారి మాట్లాడుతూ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి, ప్రాథమిక దశలో మనం తెలుసుకుంటే.ఇది ప్రమాదకారి కాదని ప్రజలని ఉద్దేశించి మాట్లాడారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, యువకులు వ్యసనాలకు బానిస కాకూడదని, చుట్ట, బీడీ, సిగరెట్, అనే పొగాకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైద్యులు దామోదర రావు తిరుపతిరావు రామకృష్ణ మరియు కే జీ బీ వీ పీ, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *