శిక్షణా తరగతులకు రాకపోతే సభ్యత్వం రద్దు

News

 

*శిక్షణా తరగతులకు రాకపోతే సభ్యత్వం రద్దు*

పద్మనాభం కన్యకా పరమేశ్వరి ఆలయం.

స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం మండల స్థాయి నాయకుల సదస్సు జరిగింది.

ముఖ్య అతిథిగా ఆర్.ఎం.పి రాష్ట్ర ఫెడరేషన్

అదనపు కార్యదర్శి జంగం జోషి మరియు జిల్లా కార్యదర్శి పచ్చిపులుసు కనకారావు విచ్చేశారు.

సంఘం గతంలో తీర్మానం ప్రకారం ప్రతి ఆర్ఎంపీ వైద్యుడు ఎప్పటికప్పుడు వైద్యపరమైన అనుభవం కలిగి కొత్త విషయాలను తెలుసుకునే విధంగా క్వాలిఫైడ్ వైద్యులతో నెలకి ఒక్కరోజు శిక్షణ తరగతులను జరుపుకున్నట్లు తీర్మానం చేసుకున్నారు.

అయితే పద్మనాభ మండలం లో ఉన్న 40 మంది ఆర్ఎంపి వైద్యులు ఉండగా,కొద్ది నెలలుగా 15 16 మంది మాత్రమే శిక్షణా తరగతులకు పాల్గొంటున్నట్లు ఆర్ఎంపీ మండల అధ్యక్షుడు రాలి అప్పారావు తెలిపారు. సంఘ సభ్యుల ఆమోదంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జోనల్ అధ్యక్షుడు జంగం జోషి తెలిపారు. అదేమనగా మూడు నెలలు వరుసగా శిక్షణ తరగతికి రాని వారిని సంఘము నుంచి వారి పేరును తొలగించాలని, తద్వారా వారికి ఇచ్చిన సభ్యత్వ సర్టిఫికెట్ను రద్దు చేయాలని,ఈ కమిటీ తీర్మానం,తీర్మానించడం జరిగిందని ఈ ప్రకటనలో తెలిపారు. ఒక ఆర్ఎంపి వైద్యుడు తన అనుభవం తో పాటు, ఎప్పటికప్పుడు వైద్యుo లో జరుగుతున్న మార్పులను తెలుసుకోవాలని,అలా తెలియకపోతే ప్రజల ప్రాణాలతో చేస్తున్న వైద్యం ఎక్కడైనా,ఎప్పడైనా వికటించి ప్రమాదం జరిగితే దానికి ఆర్ఎంపి వైద్యుడు మరియు స్థానిక ఆర్ఎంపీ సంఘం బాధ్యత వహించవలసి వస్తుందని తెలిపారు. కనుకనే అందుకని ఎప్పటికప్పుడు ఆర్ఎంపి వైద్యుడు అప్డేట్ గా ఉండాలని కోరారు. కనుకనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నాయకుల తీర్మానం సభలో ఆర్ఎంపి మండల కార్యదర్శి మీసాల వెంకటరమణ మండల కోశాధికారి ప్రసాద్ మరియు కార్యవర్గ సభ్యులు తీర్మానించి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *