429 జీవో పునరుద్ధరణ కొరకై హోంమంత్రి శ్రీ మేకతోటి సుచరిత గారికి వినతి 

News

ఆర్ఎంపి లకు చట్టబద్దత కల్పించాలి – రాజా సిద్దార్ద.

 

– 429 జీవో పునరుద్ధరణ కొరకై హోంమంత్రి శ్రీ మేకతోటి సుచరిత గారికి వినతి

 

గుంటూరు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు,అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య సంఘం(ఫెడరేషన్) జాతీయ అధ్యక్షులు రాజా సిద్దార్ద ఆద్వర్యంలో బుధవారం రాష్ట్ర హోంమంత్రి శ్రీ మేకతోటి సుచిరిత గారిని వారి హౌస్ గుంటూరు లో కలసి ఆర్ఎంపి,పిఎంపి ల చట్టబద్దత కొరకు 429 జీవో పునరుద్ధరణ కొరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళ వలసిందిగా కోరుచూ వినతి పత్రాన్ని సమర్పించారు.అట్లాగే మా సమస్యలుపై మీరు సీఎం గార్కి లెటర్ ద్వారా ఇవ్వవలసిన దిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా హోంమంత్రి గారు సానుకూలముగా స్పందించి త్వరలో గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి 429 జీవో పునరుద్ధరణ కొరకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యల్.అచ్చిరెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ డి.రామారావు,జిల్లా కోశాధికారి కోలా.నాగేశ్వరరావు,

ఆర్గనైజింగ్ డిప్యూటీ కార్యదర్శి. కె.ప్రసాద్,జిల్లా ప్రచార కార్యదర్శిsk. ఉమ్మర్,ప్రచార సహాయ కార్యదర్శి. p. నాగరాజు మహిళ అధ్యక్షురాలు గీతాంజలి, ఏసి మెంబర్స్ రంగసాయి, రాము,యూనిస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *