*కోవిడ్ రోగులకు గ్రామీణ వైద్యుడు ‘ఆకుల’ సహాయం

News

కావ్య న్యూస్ విశాఖపట్నం
*కోవిడ్ రోగులకు గ్రామీణ వైద్యుడు ‘ఆకుల’ సహాయం*
సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు విశేష సేవలు అందుతున్నాయి. కోవిడ్ అంటేనే భయపడి బంధువులకు దూరంగా ఉంటున్న పేషెంట్లకు గ్రామీణ వైద్య సంఘం ప్రతినిధులు కాయకల్ప సహాయం చేస్తున్నారు. ఈ సేవలను ఉచితంగా ఆకుల శ్రీనివాసరావు ఆర్ఎంపి వైద్యుడు ఔదర్యాన్ని పలువురు ప్రశంసించారు. ఇందులో భాగంగా విశాఖ కంచరపాలెంనకు చెందిన ఎన్.అప్పారావు (80)
అనే వ్యాధిగ్రస్తుడు కి సుమారు లక్ష రూపాయలు తమ సొంత నిధులు వెచ్చించి
ఆ సంఘం సిటీ ఇంచార్జ్ ఆకుల, ఆక్సిజన్ కన్స్ట్రెటర్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం అతన పరిస్థితి నిలకడ గా ఉందని డాక్టర్ రాజేంద్ర తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల్లో కీలక భూమిక వహించిన సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం జోనల్ అధ్యక్షుడు జంగం జోషి, ఐ. గోపాలరావు ఆకుల శ్రీనివాసరావు లకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వీరిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని డాక్టర్ రాజేంద్ర పేర్కొన్నారు. ని స్వార్థ సేవకు అంకితమైన వీరికి అందరూ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *