ఆర్.ఎం.పి.వైద్యుల *సంఘం,ప్రకటించిన లాక్ డౌన్ జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి. జంగం జోషి

News

పత్రికా ప్రకటన తేదీ17-05-21.ఆనందపురం.
ఆర్.ఎం.పి.వైద్యుల *సంఘం,ప్రకటించిన లాక్ డౌన్ జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి. జంగం జోషి,
రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని తెలిపారు.ప్రతి గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న గ్రామీణ వైద్యుల దగ్గరకు అధికంగా కోవిడ్ అనుమానిత రోగులు పెరుగుతున్నారనే విషయం అందరికీ విధి తమే. ప్రభుత్వ నిబంధన దృశ్య రోగులను చూడకపోయినా, విలేజ్ నేపథ్యంలో ఆర్.ఎం.పీ వైద్యుల పై విపరీత మైన రోగుల ఒత్తిడి పెరుగుతుందని తెలుపుతూ.. ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర జోనల్ లో 25 మందికి పై గా ఆర్.ఎం.పీ వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఒక ప్రకటనలో జంగం జోషి తెలిపారు. అనుభవ వైద్యుల సంఘాల సమైక్య ఫెడరేషన్,ఆఫ్.ఏపీ. అధ్యక్షులు రాజా సిద్ధార్థ ఆదేశాల మేరకు జోనల్ లో నేటి నుండి ప్రతి గ్రామీణ/ పట్టణ ఆర్.ఎం.పీ, వైద్యులు పూర్తిగా తమ ప్రాథమిక వైద్యంను, (ప్రాథమిక చికిత్స లయాలు) ఆపాలని లాక్ డౌన్ ప్రకటించారు.
ఈ దరిమిలా కొంతమంది ఆర్.ఎం.పీ.వైద్యులు అత్యాశకు పోయి కరోణ కిట్లతో టెస్టులు చేయటం, కరోణ కారక మందులను ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారి సభ్యత్వ రద్దు చేస్తామని ఆర్.ఎం.పీ.సంఘ అధ్యక్ష- కార్యదర్శిలు జంగం జోషి, ఐ.గోపాలరావులు తెలిపారు. త్వరలో వారి పేర్లు జిల్లా కలెక్టర్ గారికి, వైద్య అధికారులకు పంపనున్నట్లు తెలిపారు.
డబ్బు కన్నా నా ప్రాణం ముఖ్యమని, వారి మీద ఆధారపడిన కుటుంబ ముఖ్యమని, సంఘ సూచనలు, నిబంధనలు తప్పకుండా పాటించాలని జోషి. వైద్యులకు హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *