పవన్ ను టార్గెట్ చేస్తున్న వర్మ…

Movies

వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి ఫలితాలు రాబడుతున్నది. కలెక్షన్ల కూడా సినిమా వసూళ్లు రాబడుతున్న సమయంలో.. సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి సెన్సార్ బోర్డు కారణం అయ్యిందని, కొంతమంది కావాలని సెన్సార్ బోర్డు పై ఒత్తిడి తీసుకొచ్చి సినిమాకు సర్టిఫికెట్ తీసుకురావడంలో ఆలస్యం చేశారని చెప్పి కేసు ఫైల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇదిలా ఉంటె, వర్మ మరో వివాదాస్పద సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొత్త సినిమా తీయబోతున్నారట. దీనికి సంబంధించిన విషయాలను ఇటీవలే వర్మ ప్రకటించారు. ఇటీవల వర్మ చనిపోయినట్టుగా ఫోటోలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వర్మ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వర్మ తీయాలని అనుకున్న సినిమా ఏంటి ఎలా ఉండబోతుంది అన్నది త్వరలోనే వెల్లడించబోతున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *