కరోనా విపత్తు సమయంలో ఒక మహిళ పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం..

News

మాధవధార,విశాఖపట్నం.
సేవజ్యోతి: కీర్తి పట్నాయక్
కరోనా విపత్తు సమయంలో ఒక మహిళ పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని పలువురు కొనియాడారు.
ఈరోజు శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 వ వార్డు లో విధులు నిర్వహిస్తున్న విలేకరులకు సంస్థ తరుపున శానిటైజర్స్, కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమం లో 289 వార్డు వాలంటరీ రవికుమార్, వాస్తవం చానల్ జర్నలిస్టు వెంకటేష్, న్యుస్ 9 సాయిబాబు , సనపల హరిబాబు , బాలకృష్ణ, సంతోష్, రమణమూర్తి మరి కొంతమంది విలేకరులు పాల్గొన్నారు.కరోనతో బాధ పడిన కొంతమంది విలేకరులు కుటుంబాలకు కరోనా హోం ట్రీట్మెంట్ కూడా అందించారు. వారిలో గర్భిణీ స్త్రీలకు కూడా ఇంకా ఉచిత ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఇవే కాక గత కొద్ది రోజులుగా ఎవరికీ బెడ్లు,ఆక్సిజన్ దొరకనివారికి ఆమె ఎంతో సహాయ పడ్డారు. పేదలకు ఆహారం పంపిణీ నీ మరియు పలు విధమైన కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు, ఆమె చేసిన సేవా కార్యక్రమాలు పలువురు ప్రశంసలు పొందుతున్నారు ట్రస్ట్ అధినేత
కీర్తి పట్నాయక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *