వెంకిమామ గురించి మహేష్ బాబు ఏమన్నారంటే…

Movies

వెంకిమామ సినిమా డిసెంబర్ 13 న రిలీజ్ అయ్యి మంచి విజయం సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా సినిమా ఇప్పటికే మంచి వసూళ్లు రాబట్టింది. సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా, ఫ్యామిలీ సినిమాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను మాములు ప్రేక్షకులతో పాటుగా సినీహీరోలు కూడా వీక్షించి తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

ఇందులో తాజాగా మహేష్ బాబు వెంకిమామ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. వెంకిమామ సినిమా ఎంటెర్టైన్టైన్ చేసిందని, మామ అల్లుళ్లయినా వెంకటేష్, నాగ చైతన్యలు స్క్రీన్ పై చేసిన హంగామా అద్భుతంగా ఉందని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఎమోషన్స్, కామెడీ, ఫ్యామిలీ వాల్యూస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ బాబు ట్వీట్ తో సినిమాకు మరింత ప్రమోషన్ అయ్యిందని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *