మరోసారి నాగ చైతన్య – సమంత మ్యాజిక్

Movies

‘మజిలీ’, ‘వెంకీమామ’ సినిమాల తరువాత నాగచైతన్య మంచి జోష్ మీదున్నాడు. వరసగా రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో తరువాత చేయబోయే సినిమాల విషయంలో మంచి కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నాడు చైతు. చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ జనవరి నెలాఖరులో కానీ, ఫిబ్రవరిలో కానీ రిలీజ్ కాబోతున్నది. ఇదిలా ఉంటె, పరశురామ్ దర్శకత్వంలో చైతన్య సినిమా చేయబోతున్నారు. 14 రీల్స్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. వచ్చే ఈనెల నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. సమంత ఇందులో హీరోయిన్ గా చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరక్కించబోతున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *