ఏ లాభాన్ని ఆశించకుండా కృషి చేయడమే NGO

News

NGO పూర్తి రూపం
NGO యొక్క పూర్తి రూపం ప్రభుత్వేతర సంస్థ. NGO అనేది ఏదైనా లాభాపేక్షలేని, స్వచ్ఛంద పౌరుల సమూహం, ఒక మనిషి నిజమైన NGO కావడానికి ఎన్నో కష్టాలు , చేదు అనుభవాలు ఎదుర్కునేక తన జీవితపు అనుభావాలు తో కొంత మంది జీవితాలను అయిన సరిచేయాలని NGO రూపం దాల్చి సమాజానికి సేవ చేయాలి అనుకుంటారు. NGO అనేది ఇది సమాజం, పిల్లలు, పేదలు, పర్యావరణం మొదలైన వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సృష్టించబడింది. NGO అనేది ఒక సంస్థ కాదు వ్యవస్థ .ప్రభుత్వ లేదా సంప్రదాయ లాభం లేని వ్యాపారం. సాధారణంగా, ఇది సాధారణ ప్రజలు, పౌరులు ఏర్పాటు చేస్తారు. ఇది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం, ఫౌండేషన్‌లు, వ్యాపారాలు మొదలైన వాటి ద్వారా నిధులు సమకూర్చవచ్చు, జాతీయ స్థాయి లేదా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించవచ్చు. కొన్నిసార్లు, NGO లను లాభాపేక్షలేని సంస్థలు (NPO లు) అని కూడా అంటారు.
బాగా పని చేసి లాభాపేక్షలేని
NGO లు అంటే ప్రజలు ప్రభుత్వము చాలా గౌరవంగా చూస్తారు.
కాని ఈ మధ్య వీధికి ఒక NGO పుట్టగొడుగులా పుడుతుంది. వారి వెనుక వున్న బలమైన పెద్ద పెద్ద నాయకులు వీరికి సాయం చేస్తూ వుంటారు. వీరు సంఘసేవ చేస్తామంటూ హాల్ చల్ చేసేస్తువుంటారు . గబ గబ నిర్ణయాలు తీసేసుకుంటారు. బాగా పబ్లిసిటీ కోసం డబ్బు ఖర్చు పెడుతువుంటారు . నిజమైన NGO అంటే ఎలా వుండాలి రైల్వే స్టేషన్, footpath , పూరి గుడిసెలు, రోడ్ సైడ్ , గుడులు దగ్గర ఎక్కడ పేదవారు , బిచ్చగాళ్ళు వుంటారో అక్కడికి వెళ్లి సర్వీస్ చేయాలి . వేదికలు ఆర్భాటాలు NGO లకు వుండకూడదు. రాజకీయ నాయకులు involvement వుండకూడదు. ప్రభుత్వ అధికారులతో మాత్రమే పబ్లిక్ మీటింగ్స్, అవి పెట్టించాలి. ఏ పార్టీ కి అనుగుణంగా పని చేయకూడదు. స్వచ్చందంగా ఎవరు పని చేస్తున్నారో అలాంటి వారిని కలుపుకుంటూ ఒక కూటమిగా సమాజానికి సేవ చేయాలి. NGO అంటే వేదిక కాదు . Shellter. NGO అంటే హంగు ఆర్భాటం తో పేపర్ advertisement చేసుకోవడం కాదు ఆకలి తీర్చే అక్షయపాత్ర. ఈ మధ్య కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేపర్ కి మాత్రమే పరిమితమై చివరకు బాగా పని చేసే స్వచ్చంద సంస్థలకు కూడా ఇలాంటి వారు వలన చెడ్డ పేరు వస్తుంది. NGO అనేది స్వార్థం లేని సేవకు ప్రతికగా వుండాలి. పెళ్లి పేరుతో మోసపోతున్న చాలా మంది ఆడపడుచులు, మేము మోసపోయాము మాకు న్యాయం చేయండని గొంతెత్తి అరిచినా పట్టించుకోని కొంతమంది అధికారులు, కుల పెద్దలు, ఇలాంటి నిరాశ నిస్పృహ ఎదురైనా అపుడే ఒక స్త్రీ NGO గా ఉద్భవిస్తుంది. సమాజం లో వున్న కొంత మంది అనాధలను అయిన ఆదుకోవాలనుకుంటాది. ఏ ప్రేమకు నోచుకోని ఆమె కొంతమందికి అయిన తల్లిలా, చెల్లిలా , కూతురులా ప్రేమను పంచాలనుకుంటాది.

ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది..
అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా‌ అక్కడ పల్లీలు బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది.

చదువు, సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను!’ అన్న ఒక్క ఆలోచన ఆమెలో #ఆశాదీపం వెలిగించింది.
అప్పటి నుండి తీరంలో బఠాణీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది.

‌‌‌‌‌‌‌‌ మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో ఐదు, ఏభై, కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయలకు చేరింది.

కొన్నాళ్ళకు సూక్ష్మ ఋణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది.

మరి కొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యత నిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్ లు నెలకొల్పగలిగింది.
ప్రస్తుతం ” Sandeepa Chain Of Restaurants ” అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల రు.50 లక్షలు.

1982లో కేవలం 50 పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు రు.50లక్షలకు చేర్చిన ఆమె విషాదగాథకు ప్రత్యక్ష సాక్షి ‘చెన్నై మెరీనాబీచ్’.
2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు
” #పెట్రిశ్రియనారాయణ్ ”.
తినడానికి తిండిలేని నిర్భాగ్యస్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమయిపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేలమందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవితగాథలే కదా మనకు స్ఫూర్తి!.
శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం.
అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తి పొందాలి. చిన్నచిన్న వైఫల్యాలకే నీరసించిపోయే స్వభావం గల వారికి అపజయాలకు క్రుంగిపోయేవారికి ఇటువంటి సజీవగాథలే🙏🙏

కీర్తిపట్నాయక్. శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *