సచివాలయం ను సందర్శించిన డి ఆర్ డి ఎ, పి డి విశ్వేశ్వర్ రావు గారు

News

ఈరోజు వేములవలస సచివాలయం ను సందర్శించిన డి ఆర్ డి ఎ, పి డి విశ్వేశ్వర్ రావు గారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది టైమ్ పాటిస్తున్నారా లేదా, లబ్దిదారులకు సక్రమంగా పింఛన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే వారికి నివృత్తి చేసి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కోరారు. అలేగే ఏటువంటి పింఛన్ కావాలన్న వారి సంవత్సర ఆదాయం లక్ష ఇరవై వేల రూపాయలు లోపు వుండాలని ప్రభుత్వ నిబంధనలు కూడా తెలియ జేశారు. తదుపరి నూతనంగా మంజూరు అయిన 17 మంది పెన్షన్ దారులకు ఎం పీ టి సి శ్రీమతి కోరాడ సూర్యకుమారి గారు చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంక కొందమ్మ, మాజీ సర్పంచ్, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరాడ అప్పలస్వామి నాయుడు, కోరాడ అచ్యుత సాధు రాంబాబు, వార్డ్ మెంబర్ కోరాడ సూర్యకుమారి, సెక్రెటరీ శ్రీరామ మూర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్ శివ, వాలంటీర్స్ , తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *