దారుణం.. మర్మాంగాలకు నిప్పంటించి చంపేశారు..

Crime

కేరళ రాజధాని తిరువనంతపురంలో దారుణం జరిగింది.సెల్‌ఫోన్ దొంగిలించాడన్న కారణంగా ఓ వ్యక్తి(30)పై ఏడుగురు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆపై అతని మర్మాంగాలకు నిప్పంటించారు. దీంతో 40శాతం కాలిన గాయాలతో అతను మృతి చెందాడు. అతనిపై దాడికి పాల్పడ్డవారిలో ఆటో డ్రైవర్స్ కూడా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. తిరువనంతపురం బస్టాండ్‌లో పడుకున్న ఆ వ్యక్తిపై.. సెల్‌ఫోన్‌, పర్సు దొంగిలించాడన్న కారణంతో దాడి చేసినట్టు చెప్పారు. మర్మాంగాలకు నిప్పంటించడంతో.. కాలిన గాయాలతో అతను మృతి చెందాడన్నారు. ఏడుగురు నిందితుల్లో నజీర్,దినేశ్,అరుణ్,సాజన్,రాబిన్సన్‌లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *