అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా

Politics

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన సభలో మాట్లాడుతూ..ఉపాధి హామీ పనుల్లో తాము అక్రమాలకు పాల్పడ్డామంటూ చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. తాము ముడుపులు తీసుకున్నానని చంద్రబాబు నిరుపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కాగా కేంద్రం నుంచి 1845 కోట్ల రుపాయల ఉపాధి నిధులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఉపాధి పనుల్లో భాగంగా వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంత్సరంలో కూలీల వేతనాలు చెల్లించమన్నారు. నీరు చేట్లు నిధులను గత టిడిపి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన మండిపడ్డారు. ఉపాధి నిధులను డైవర్టు చేశామని కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. అయితే రాష్ట్రానికి నిధులు రాకూడదని టిడిపి ఉద్దేశమా అని ఆయన ప్రశ్నించారు. కాగా రాష్ట్రంలో 2,114 ఫిల్టర్‌ బెడ్లు ఉన్నాయని..వీటిలో 1350 ఫిల్టర్‌ బెడ్లు పనిచేస్తున్నాయన్నారు. గోదావరిలో కాలుష్యం వల్ల నీరు వడపోత కావడం లేదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *