అమరావతి: శాసనమండలి లో ప్రశ్నోత్తరాల సందర్బంగా నకిలీ విత్తనాలు, ఎరువులు అనే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గుంటూరు కేంద్రంగా నకిలీ దందా నడుస్తోందని, దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ చేసిన దాడుల్లో రూ. 5.46 కోట్ల విలువైన కల్తీ యూరియాను సీజ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. 1455 నమూనాలను పరీక్షించగా 35 నమూనాలు నాసిరకంగా తేలాయని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకున్నామని సభకు వివరించారు.
