ఆనందపురం మండల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు …

ఈరోజు ఆనందపురం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సూచనల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు గారి ఆదేశాలనుసారం పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని భీమిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కోరాడ రాజబాబు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆనందపురం మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పార్టీ ఇచ్చినటువంటి హౌస్ మ్యాపింగ్ అలాగే వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రతి నాయకుడు వారి వారి పరిధిలో ఉన్న వాటర్ లను వారి ఇంటి వద్దకు వెళ్లి గుర్తించి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగి వారి ఓటు హక్కును స్వేచ్ఛ స్వతంత్రాలతో వినియోగించుకునే విధంగా వాటర్ గుర్తింపును చేసుకొని వారు నివసిస్తున్న ఇంటి నెంబర్తో హౌస్ మ్యాపింగ్ చేసే కార్యక్రమం కనుక పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇచ్చిన కార్యక్రమాన్ని శ్రద్ధతో కచ్చితత్వం ఉండే విధంగా చేయాలని తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో వారితోపాటు ఆనందపురం మండల పార్టీ ప్రెసిడెంట్ బొద్దాపు శ్రీనివాస విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మీసాల సత్యనారాయణ ఎక్స్ ఎంపీపీ చెన్నా నర్సింగ రావు విశాఖ పార్లమెంట్ యువత ఉపాధ్యక్షులు గండ్రెడ్డి రమేష్ భీమిలి నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు తాట్రాజ్ అప్పారావు ఉపాధ్యక్షులు కొట్టియాడ రెడ్డి బాబు ఎంపీటీసీలు బంటుపల్లి అప్పలస్వామి పడాల అప్పలనాయుడు మామిడిలోవ సర్పంచ్ బలిరెడ్డి మల్లికార్జునరావు (చంటి) నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు చెందవరపు కుమార్ తదితర మండల ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *