పబ్లిక్ లైబ్రరీ. ద్వారకనగర్.
ఘనంగా జరిగిన డాక్టర్స్ డే
స్థానిక లైబ్రరీలో ఆర్.ఎం.పి సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జాయింట్ కలెక్టర్. విశ్వనాథన్, కేజీహెచ్ సూపర్డెంట్ డా. శివానంద్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అధినేత డా. ఒన్న మురళీకృష్ణ విచ్చేశారు. జాయింట్ కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ కోవిడ్ లో ఆర్ఎంపీ వైద్యులు సేవలు మరువలేనివి.అలాగనే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇస్తున్న సేవలు ఇంకా మెరుగు పరుచుకుంటే బాగుంటుందని సూచించారు. కె.జి.హెచ్.డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు వారి యొక్క సేవలు ఎప్పటినుంచో గ్రామీణ మారుమూల ప్రాంతంలో ఉంటున్నాయని గ్రామాలకి మారుమూల ప్రాంతాలకు మీ సేవలు చాలా అవసరమని అన్నారు. డాక్టర్ మురళీకృష్ణ క్యాన్సర్ పై పలు సూచనలు తో అవగాహన కల్పించారు. ఆర్ఎంపి వైద్యుల సంఘం వారు డాక్టర్లకు సేవా తత్పరులకు సత్కరించారు. ఇందులో డాక్టర్ స్వాతి రెడ్డి గత కొద్ది నెలల క్రితం విద్యార్థి దశలోనే ట్రైన్ లో వెళ్తుండగా ఒక మహిళలకు ఒక మహిళకు పురుడు పోసి బిడ్డని అందించిన సంగతి అందరికీ విదితమే దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆమెకి సన్మానం చేశారు. అలానే విజయనగరం జిల్లా గరివిడి కి చెందిన డాక్టర్ ఏ.ఎన్. ఆనంద్ 88 సంవత్సరాలు రెండు రూపాయల వైద్యంతో ఎంతో మంది పేదలకు సేవలు అందించిన సేవా తత్పరుడు ఆయనకీ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సంఘ జోనల్ వ్యవస్థాపద్యక్షులు జంగం జోషి మాట్లాడుతూ.. సంఘం నేటికీ 18 సంవత్సరాలు నుండి ఆర్ఎంపి గ్రామీణ వైద్యులకు ఎప్పటికప్పుడు విద్య, వైద్యంపై అవగాహన కల్పిస్తూ, సంఘాన్ని ఆరు జిల్లాల్లో అభివృద్ధి పరచామని తెలిపారు.
కార్యదర్శి ఎన్ సుగుణేశ్వరి గౌరవ సలహా దారులు డాక్టర్.ఎల్.ఎన్. రావు, విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు, కే.ఎన్ రావు. న్యోరో సైక్రాటిస్ట్ డాక్టర్.రమేష్ బాబు జై భీమ్ కన్వీనర్ & అవంతి కంప్యూటర్స్ డైరెక్టర్ కోన ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కి సభాధ్యక్షులుగా మమ్ముల తిరుపతిరావు వ్యహరించారు. స్థానిక ఆర్ఎంపీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *