మంత్రి కొండపల్లిని కలసిన*
*ఆర్ యమ్ పి సంఘం*
జూలై 5: స్థానిక జిల్లా పరిషత్ విశ్రాంత భవనంలో విజయనగరం. రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు,సెర్ప్,యన్.ఆర్.ఐసాధికారత మరియు సంబంధాల శాఖామాత్యులు కొండపల్లి శ్రీనివాస్ ను ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గెద్ద చిరంజీవి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు.ఈ సందర్భంగా సంఘా వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ విద్యాదికుడు, సామాజిక సేవా తత్పరుడు అయిన శ్రీనివాస్ చిన్న వయసులోనే శాసనసభ కు ఎన్నికవ్వడంతో పాటు రాష్ట్ర మంత్రి కావడం అభినందనీయమని,జిల్లా ప్రజల సమస్యలు పరిష్కారంతో పాటు అభివ్రుద్ది చెందుతుందని ఆకాంక్ష వెలిబుచ్చారు.గౌరవ అద్యక్షుడు మమ్ముల తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినందున మంత్రి శ్రీనివాస్ మా సమస్య పట్ల సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి ద్రుష్టిలో పెట్టి గుర్తింపు కోసం క్రుషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి కర్రి సత్యనారాయణ,మహిళా కార్యదర్శి భవానీ, సభ్యులు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.