సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నా, విశాఖ సంయుక్త జిల్లాల ఆర్ఎంపీ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. దశాబ్దాల కాలం నుండి గ్రామీణ ప్రాంతాలను నమ్ముకున్న, ఆర్ఎంపి వైద్యుల సమస్యలను ఎన్ని సార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పట్టించుకోవటం లేదని, ఈ మహాసభ నిర్వహణ ద్వారా మళ్ళీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ సభకు అతిథిగా భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ ఆహ్వానించినట్లు తెలిపారు. ఆర్.ఎం.పి జోనల్ అధ్యక్షుడు. జంగం జోషి. సిటీ ఇంచార్జ్ ఆకుల శ్రీనివాసరావు, సహకార దర్శి లోగిస గణేష్, బాలకిషోర్, ఇంకా షార్ట్ ఫిలిం డైరెక్టర్. ఈశ్వరరావు, భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాద రావు పట్నాయక్, యువజన నాయకుడు సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *