గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం మాట్లాడారు నాలుగు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కల్పించే గరుగుబిల్లి బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తి చేయాలని, ఆండ్ర రిజర్వాయర్,గిరిజన నిర్వాసితులకు చేపల సొసైటీ ఏర్పాటు చేయాలని ఆండ్ర బ్రిడ్జి నుండి పనస వలస కుంభీ వలస పైడిపర్తి వరకు రోడ్డు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజన సమస్యలను ప్రభుత్వం వెంటనే పట్టించుకోని గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలని అనంతగిరి జెడ్పిటిసి దీసరి గంగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తామరపల్లి సోములు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గొర్ల శ్రీనివాస్ నాయుడు జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి రాకోటి రాములు ఐద్వా మెంటాడ మండలం కన్వీనర్ చెవ్వూరి కృష్ణవేణి ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి రాము తదితరులు పాల్గొన్నారు.