అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖందించిన కొండపల్లి, బొత్స.
మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అనుమతులు పొందిన కాంట్రాక్టర్ వద్ద నుండి గరుడబిల్లి రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీకి ఇసుక వెళుతుంటే అడ్డుకొని, డబ్బులు వసూలు చేయడాని ప్రయత్నం చేశాడని, అది కుదరక పోవడంతో ఇతరులపై అసత్య ఆరోపణలు చేయడం మొదలు పెట్టారని మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమ భూ దందాలు చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు.భినామిల ఎకౌంట్ల లలో కోట్లాది రూపాయలు ఉన్నాయంటు అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు. అవసరమైతే నా ఎకౌంట్లు చెక్ చేసుకోండి అని సవాల్ చేసారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గార తవుడు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, ఎంపీపీ ప్రతినిధి బెల్లాన త్రినాధరావు, నాయకులు మండల సురేష్, కరణం ఆదినారాయణ, వ్యవసాయ సలహా మండలి సభ్యులు సామంతుల పైడిరాజు, కర్రీ రామునాయుడు, కర్రీ నానాజీ, తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *