ఆనందపురం : గ్రామీణ వైద్యులకు గుర్తింపునివ్వాలని గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి డిమాండ్ చేశారు. గురవారం. వేములవలసలోని ఆర్ఎంపిల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వృత్తినే ఆధారంగా రాష్ట్రంలో సుమారు 50 వేల మంది గ్రామీణ వైద్యులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. జిఒ 429ని పునరుద్ధరించి, గ్రామీణ వైద్యులకు ఆసరా, గుర్తింపును ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అనుభవ వైద్యుల సంఘాలన్నిటినీ సమైక్యం చేసి, గ్రామీణ వైద్యుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడే అధికారాన్ని రాష్ట్ర ఫెడరేషన్ కమిటీకి అప్పచెప్పుతూ ఈనెల 27న విశాఖ జిల్లా మహాసభలో తీర్మానించామన్నారు. సమావేశంలో గౌరవ వైద్య
సలహాదారులు డాక్టర్ ఎన్ఎల్ రావు, కలం ఫౌండేషన్ చైర్మన్ మమ్ముల తిరుపతిరావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు సుగుణేశ్వరి, జిల్లా కార్యదర్శి. పి. కనకారావు, కోశాధికారి పి. రామకోటేశ్వరరావు. విజయనగరం జిల్లా సలహాదారులు అల్లాడ త్రినాధరావు స్థానిక మండల అధ్యక్ష కార్యదర్శులు కడగల నారాయణరావు, పి.సుధాకరరెడ్డి, పి.అశ్వని, రాధికా బెహరా పాల్గొన్నారు.
