విశాఖపట్నం.అక్టోబర్ 26:విద్యార్థిని,విద్యార్థుల్లో నిగూఢమైన స్రుజనాత్మకత శక్తిని వెలికి తీసి,వారిలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మానసిక స్థితిని పెంచడానికి ఉపయోగపడేదే ఒలింపియాడ్ పరీక్ష అని దీనిని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల,కళాశాలల యాజమాన్యాలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో ఆయన కేంపు కార్యాలయంలో దేశ వ్యాప్తంగా సెమ్స్ ఫౌండేషన్ నిర్వహించనున్న ఒలింపియాడ్ పరీక్ష బ్రోచర్,కర పత్రాలను విడుదల చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయడమే కాకుండా భవిష్యత్ లో పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక అంశాలపై విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఒలింపియాడ్ పరీక్షలు ఉపయోగపడతాయని,దేశ వ్యాప్తంగా సెమ్స్ ఫౌండేషన్ నిర్వహించనున్న ఈ పరీక్షలను అందరూ వినియోగించుకోవాలని అన్నారు.ఈ సెమ్స్ ఫౌండేషన్ కు రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో మాట్లాడి,అవకాశమున్నంత వరకు సహకరిస్తామన్నారు.ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మమ్ముల తిరుపతిరావు ఆద్వర్యంలో సెమ్స్ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్
ఏ ఏ ఆర్సీ రెడ్డి,కో ఆర్డినేటర్ యస్ యన్ రెడ్డి,ఏపి రాష్ట్ర కన్వీనర్ జ్ఞానేశ్వరరావు,కలాం ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగం జోషి, కె. వెంకట రత్నాలు తదితరులు పాల్గొన్నారు.
