సోషల్ మీడియాలో సూపర్ వార్…

Movies

కొత్త సంవత్సరంలో కొత్త సినిమాలు అనేకం రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనేక సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మొదట సంక్రాంతికి పండుగ రజినీకాంత్ దర్బార్ సినిమాతో ఆరంభం కాబోతున్నది. దర్బార్ సినిమా జనవరి 9 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

ఇప్పటికే రిలీజైన దర్బార్ ఆల్బమ్ ఆకట్టుకుంది. నిన్నటి రోజున దర్బార్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆదిత్య అరుణాచలంగా రజినీకాంత్ మరోసారి మెప్పించారు. రజినీకాంత్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. రజిని మాస్ హీరో. సినిమా ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా.. వెంటనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేస్తుంది. రజిని సినిమా హిట్ కొట్టిందంటే మరో సినిమా బరిలోకి దిగలేదు. అలా ఉంటుంది. దర్బార్ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతున్నది. నిన్నటి రోజున మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాకు సంబంధించిన మూడో సింగిల్ హీ ఈజ్ సో అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సోషల్ మీడియాలో టాప్ 2 గా ట్రెండ్ అవుతున్నది. టాప్ 1 లో రజిని దర్బార్ ఉంటె, టాప్ 2 లో మహేష్ సరిలేరు నీకెవ్వరూ సాంగ్ ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *