లీడర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత వైద్య సేవలు
మద్దిలపాలెంలో గత రెండు రోజుల నుండి స్థానిక సీఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న శిఖరాగ్ర రాష్ట్ర పండుగలలో వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ప్రజలకు,
సామాజిక సేవలో భాగంగా లీడర్ సొసైటీ ఆధ్వర్యంలో వ్రింద హాస్పిటల్ వారి సహకారం తో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెవ.గుంటూరు గవరనింగ్, మెంబర్ యేసుదానం ప్రారంభించారు. లీడర్ సొసైటీ,ఉత్రాంద్ర గ్రామీణ వైద్యులు సంఘo అధ్యక్షులు జంగం. జోషి,విశాఖ జిల్లా ఆర్.ఎం.పి.అధ్యక్షులు ఆకుల.శ్రీనివాసరావు, లోగిస గణేష్, అప్పుగార్ భాస్కర్, వైద్య సేవలు అందించారు. జంగం జోషి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మారుమూల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలే కాకుండా, క్యాన్సర్ పై ప్రజా అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు.సుమారు 200 మందికి వైద్య సేవలు తో పాటు షుగర్ పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జైభీమ్ సంస్థ కన్వీనర్ కోన.ప్రకాష్, క్యాంపు కన్వీనర్ పాస్టర్ జాకోబ్, వ్రిందా హాస్పిటల్ స్టాఫ్ బాబ్జి,సీత,శిరీష, స్థానిక ఆర్ఎంపి వైద్యులు మురళి,కె. వెంకటరావు. తదితరులు పాల్గొన్నారు..

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *